![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -232 లో.....ఆనందరావుని నర్మద చూడగానే దొంగ అని ఆరవడంతో అందరు బయటకు వస్తారు. దాంతో ఆనందరావు పారిపోతాడు. నర్మదకి బీరువా తాళం కనిపిస్తుంది. అందరు అంతా వెతుకుతుంటారు. కానీ అతను ఎదరుగా ఉన్న భద్రవతి ఇంట్లోకి వెళ్తాడు. భద్రవతి ఎవరు అక్కడ దొంగ అని అరవడంతో ఇంట్లో అందరు బయటకు వస్తారు. ఆనందరావుని చూసి వీడు రామరాజు వియ్యంకుడు అని భద్రవతి అంటుంది.
మరొక వైపు దొంగ కోసం రామారాజు ఇంట్లో అందరు వెతుకుతారు. నర్మద తాళాలు చూపిస్తూ ఈ తాళాలు దొంగ చేతిలో నుండి పడిపోయాయని నర్మద అంటుంది. నీ దగ్గర ఉండాల్సిన తాళాలు అతని దగ్గర ఎందుకున్నాయని నర్మద అడగానే ఏమో నా గదిలోకి వచ్చి దొంగతనం చేసాడేమోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. దొంగ ఎక్కడికి పోలేదు దొరికితే అన్ని నిజాలు బయటకి వస్తాయని నర్మద అంటుంది.
ఆ తర్వాత నువ్వు ఆ రామరాజు వియ్యంకుడివి మా ఇంట్లోకి ఎందుకు వచ్చావని భద్రవతి అడుగుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళబోయి ఇటు వచ్చానని అతను అనగానే ఎవరు నమ్మరు.. రేపు ప్రొద్దున ఆ రామరాజు పరువు తీస్తానని భద్రవతి అంటుంది. మరొకవైపు రామరాజు ఇంట్లో దొంగ అంటూ అందరు హాల్లో కూర్చొని ఉంటారు. ఇదే కరెక్ట్ టైం మావయ్య గారని అత్తయ్య మధ్య మాటలు కలపడమని ప్రేమ, నర్మద అనుకుంటారు. తరువాయి భాగంలో ఆనందరావుని తీసుకొని రామరాజు ఇంటికి గొడవకి వస్తుంది భద్రవతి. నా ఇంటికి దొంతనానికి వచ్చాడని భద్రవతి అనగానే అంటే రాత్రి ఈ ఇంటికి దొంతనానికి వచ్చింది అతనే అని నర్మద అనుకుంటుంది. పేరు ప్రతిష్ట ఉన్న మా వియ్యంకుడిని దొంగ అంటావా అని రామరాజు వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |